హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ నియామకాలపై 23 అభ్యంతరాలు

SRCL: అంగన్వాడీ నియామకాలపై 23 అభ్యంతరాలు వచ్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం తెలిపారు. నివాసం, కులం, మార్కుల వెయిటేజ్, విద్యార్హతలపై ఫిర్యాదులు అందాయన్నారు. చందుర్తిలో రోస్టర్, కొత్తపల్లి-2లో మార్కుల పర్సంటేజీలో సాంకేతిక తప్పిదాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. మిగతా అభ్యంతరాల పరిశీలన కొనసాగుతోందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.