హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాంగ్ వార్.. నలుగురు హతం

హర్యానాలోని రోహ్‌తక్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఖరావడ్ గ్రామ సమీపంలోని మిలన్ హోటల్‌లో నలుగురు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సమాచారం అందుకున్న ఐజీ, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యలను హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.