హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KMR: సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. హర్షవర్ధన్, రసవీణ జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. శ్రీ నిత్య, ప్రజ్ఞ జిల్లా స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించారు.