JN: గోపిరాజుపల్లి వద్ద కల్వర్టును మరోసారి ధ్వంసం చేయడంతో బచ్చన్నపేట చెరువులకు కెనాల్ నీటి ప్రవాహం నిలిచిపోయింది. గోపిరాజుపల్లి, పెద్దపాడు ప్రాంతాలకు చెందిన కొందరి చర్యలతో చెరువులకు నీరు చేరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కెనాల్ నీటికి అడ్డుకట్ట.. కల్వర్టు ధ్వంసం!


