హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీఆర్వోగా అశోక్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు

నల్గొండ ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఈ నెల 23న నల్గొండ డీఆర్వోగా పనిచేస్తున్న దశరథ నాయక్ ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. దీంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో అశోక్ రెడ్డిని నియమించారు.