భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాల పరిష్కార దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు నిర్వహణ, అపరిష్కృత అంశాలపై ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు సమావేశమయ్యారని విదేశాంగశాఖ వెల్లడించింది. 10 రోజుల పాటు ఇరు దేశాల ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం.
వార్తలు
సరిహద్దుపై భారత్-చైనా మధ్య భేటీ


