హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ తొలి ఎన్నికల సమరం

GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ తొలి ఎన్నికలు ప్రారంభమైనాయి. మొత్తం 62 డివిజన్ల పరిధిలో 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 82 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మేయర్ పదవికి 8 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కూటమి అభ్యర్థి పేరం ఏడుకొండలు, వైసీపీ అభ్యర్థి పున్నా నాయక్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.