హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగానికి బారులు తీరిన ఓటర్లు

KDP: సిద్ధవటం మండలంలోని జంగాలపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గ్రామంలోని 1, 2, 3వ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో ఇప్పటికే 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.