హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

6 కిలోల గంజాయి పట్టివేత

VSP: భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో గంజాయితో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన పబిత్రో బత్రియా (29), అరబింద నాయక్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 కిలోల గంజాయి, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.