హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

31వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ

బాపట్ల పట్టణంలోని 31వ వార్డు పరిధిలో గురువారం ఉదయం స్వల్ప ఘర్షణ జరిగింది. మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహిళా, బాలికల హాస్టల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద తలెత్తిన వాగ్వాదంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినట్లు స్థానిక సమాచారం.