BPT: సార్వత్రిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సీఐ శశి కుమార్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ పోలింగ్ కేంద్రాను పరిశీలించిన సీఐ


