హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెరికా ఆరోపణలను కొట్టిపారేసిన భారత్

భారత్‌పై అమెరికా చేసిన అధిక తయారీ సామర్థ్యం ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. ఏ రంగంలోనూ మిగులు ఉత్పత్తి సామర్థ్యం తమకు లేదని స్పష్టం చేసింది. భారత్ దిగుమతులపై 25 శాతం వరకు సుంకాలు విధించే అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ట్రేడ్ ఆందోళలను వాణిజ్య చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని సూచించింది.