హైదరాబాద్: 28°C
వ్యాపారం

కృష్ణమూర్తి హయాంలో ఫ్లిప్‌కార్ట్‌ 5 రెట్లు వృద్ధి

ఫ్లిప్‌కార్ట్ CEOగా కళ్యాణ్‌ కృష్ణమూర్తి వైదొలగడంతో ఆయన 11 ఏళ్ల ప్రస్థానం చర్చనీయాంశమైంది. ఆయన నాయకత్వంలో కంపెనీ వ్యాపారం ఏకంగా ఐదు రెట్లు వృద్ధి చెందింది. ముఖ్యంగా 'ది బిగ్ బిలియన్ డేస్‌'ను దేశంలోనే అతిపెద్ద పండుగ షాపింగ్‌ సీజన్లలో ఒకటిగా తీర్చిదిద్దారు. కొత్త సేవలు, విక్రేతలకు అవకాశాలు కల్పిస్తూ ఫ్లిప్‌కార్ట్‌ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.