AP: రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఇవాళ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ 19 ఛైర్మన్ పదవుల కోసం 134 మంది, 707 వార్డు స్థానాల కోసం 2,057 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ 19 స్థానాల్లో 13.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ విధుల కోసం 14 వేల మంది సిబ్బందిని నియమించారు. NOV 30న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
వార్తలు
19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోలింగ్


