హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఐపీఓ సన్నాహాలను మళ్లీ మొదలెట్టిన ఫోన్‌పే!

దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే సన్నాహాలు ముమ్మరం చేసింది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.12–14 వేల కోట్లు సమీకరించే లక్ష్యంతో, త్వరలో సెబీకి సవరించిన ముసాయిదా పత్రాలు సమర్పించనుంది. మార్కెట్ పరిస్థితులు కుదుటపడటంతో వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.1.2–1.5 లక్షల కోట్ల వాల్యూయేషన్‌తో ఐపీఓకు రానున్నట్లు సమాచారం.