హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏడాదిలో వెయ్యి ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు!

TG: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్‌కు అనుగుణంగా ఏడాదిలోగా 1,000 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని TGREDCO లక్ష్యంగా పెట్టుకుంది. GHMC పరిధిలో ఇప్పటికే ఉన్న 194 స్టేషన్ల నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. DEC 31 నాటికి నగరంలోని అన్ని స్టేషన్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. టీజీ రెడ్కో స్టేషన్లలో యూనిట్‌కు రూ.13 (GST అదనం) ఛార్జి వసూలు చేయనున్నారు.