హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,220 తగ్గి రూ.1,24,580కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 తగ్గి రూ.1,14,220 ఉంది. అటు కిలో వెండి ధర ఒకేసారి రూ.10,000 తగ్గి రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.