నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. ఇటీవలే పాల ధరలు పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు బ్రెడ్ ధర కూడా రూ.5 మేర పెరిగింది. 6 నెలల వ్యవధిలోనే బ్రెడ్ ధరలు పెరగడం ఇది రెండోసారి. మైదా, గోధుమలు, చక్కెర, పాలు వంటి ముడిసరుకులతో పాటు రవాణా ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు కారణమని బేకరీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పాలు, బ్రెడ్ ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాల బడ్జెట్ మరింత భారంగా మారింది.
వ్యాపారం
సామాన్యులకు మరో బిగ్ షాక్!


