SRPT: మోతే మండలం నాగయ్యగూడెంలో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. డ్రైనేజీ కాలువలు లేక నీరు బయటకు వెళ్లే మార్గం లేదని, గ్రామపంచాయతీకి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వేడుకోలు


