హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడీబీ రోడ్డుపై దిగబడిన రాళ్ల లారీ

E.G: రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డుపై రాళ్ల లోడు లారీ దిగబడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. లారీని కదిలించే ప్రయత్నంలో దుమ్ము ఎగిసిపడి కళ్లలో పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. రాజానగరం నుంచి పెద్దాపురం వరకు రూ.300 కోట్లతో చేపట్టిన ఏడీబీ రోడ్డు పనులు రంగంపేట పరిధిలో నత్తనడకన సాగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.