హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెరికా మార్కెట్లలో ఏఐ షేర్ల బ్లడ్‌బాత్‌

అమెరికా స్టాక్ మార్కెట్లలో AI షేర్ల పతనం కొనసాగుతోంది. AI పెట్టుబడులపై ఆందోళనలు, ట్రంప్ కొత్త టారిఫ్ ప్రతిపాదనలతో మార్కెట్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 2.28%, S&P 500 1.31%, డౌజోన్స్ 0.15% నష్టపోయాయి. ఒక్కరోజే టెక్ కంపెనీల మార్కెట్ విలువలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. మైక్రాన్ 11%, AMD 9%, అమెజాన్ షేర్లు 5% పడిపోగా టెక్ రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.