హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతిలో రివర్‌ఫ్రంట్‌ ప్రాంతం పరిశీలన

AP: అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధుల బృందం.. రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను సందర్శించింది. కృష్ణా కరకట్ట ఈ-1 రహదారి, మందడం పంచాయతీలో అభివృద్ధి పనులను పరిశీలించింది. సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారి రెండు, మూడో దశ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించింది. రాజధాని అభివృద్ధి పనులపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.