GNTR: పొన్నూరు మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఒత్తిడితో అర్ధరాత్రి తమ నేతలను అక్రమంగా నిర్బంధించారని విమర్శించారు. గతంలో మన్నవ గ్రామంలోనూ ఇలాగే జరిగిందన్నారు. నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేసి, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఈసీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నూరు ఎన్నికల్లో వైసీపీ నేతల నిర్బంధం..!


