హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పోలింగ్ ప్రారంభం!

NTR: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.