హైదరాబాద్: 28°C
క్రీడలు

2028 థామస్‌-ఉబర్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం

భారత్‌కు మరో అంతర్జాతీయ క్రీడా టోర్నీ ఆతిథ్యం దక్కింది. 2028 థామస్‌-ఉబర్‌ కప్‌ ఫైనల్స్‌ ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటించింది. ఈ టోర్నీలో 24 జట్లు పోటీపడనున్నాయి. గతంలో 5 మ్యాచ్‌ల ఫార్మాట్‌లో సాగిన పోటీలను 3 మ్యాచ్‌లకు కుదించారు. భారత్‌లో 2014లో ఈ టోర్నీ జరగ్గా.. 2028లో రెండోసారి ఆతిథ్యమిస్తోంది.