హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్‌పై భారత్ అద్భుత విజయం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. గ్రూపు మ్యాచ్‌లో జపాన్‌ను 4-0 తేడాతో మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. తాజా విజయంతో FIH ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి 4వ ర్యాంక్‌కు చేరుకుంది. 2003లో ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇండియాకు ఇదే అత్యుత్తమ ర్యాంక్.