హైదరాబాద్: 28°C
క్రీడలు

హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

కెప్టెన్ పదవిపై ముంబై ఇండియన్స్ కీలక సంకేతమిచ్చింది. తాజా సోషల్ మీడియా పోస్టులో తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మనే అని చెప్పకనే చెప్పింది. ఓ చేయి ముంబై క్యాప్ పట్టుకుని ఉన్న యానిమేటెడ్ ఫొటోను షేర్ చేసింది. 2020లో టైటిల్ గెలిచినప్పుడు రోహిత్ సరిగ్గా అలాగే క్యాప్ పట్టుకుని ఉన్నాడు. దీంతో మళ్లీ హిట్‌మ్యానే కెప్టెన్ అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు.