హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయిన విజయ్‌ శంకర్‌

ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ తరఫున ఆడుతున్న భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో మిలన్ ఐకాన్స్‌పై 34* పరుగులు చేసిన అతడు, తాజాగా బ్రెసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 39 పరుగులతో పాటు ఒక వికెట్ తీసి జట్టును గెలిపించాడు.