హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఎస్పీ

MDK: ఎస్పీ శ్రీనివాసరావు చిన్నశంకరంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం స్వయంగా తన వాహనంలో ఇంధనం నింపుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, ఖచ్చితమైన కొలతలతో ఇంధనం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.