AP: పంచాయతీ ఎన్నికల వేళ మార్కాపురం జిల్లా C.S.పురం మం. అయ్యలూరివారిపల్లిలో ఒక్కో ఓటుకు ఒక అభ్యర్థి రూ.25 వేలు చొప్పున పంచినట్లు ప్రచారం జరుగుతోంది. మరో అభ్యర్థి రూ.20 వేలు, ఇంకొకరు రూ.15 వేలు ఇచ్చినట్లు సమాచారం. ఇతర నగరాల్లో ఓటర్లు రావడానికి ఛార్జీల కింద మరో రూ.5 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ స్థానం OC జనరల్ రిజర్వ్. మొత్తం 841 మంది ఓటర్లు ఉండగా ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
వార్తలు
అక్కడ ఒక్కో ఓటుకు రూ.25 వేలు?


