AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ పోలవరం, కోనసీమ, తూ.గోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
వార్తలు
ఉపరితల ద్రోణి.. ఈ జిల్లాల్లో వర్షాలు


