హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్కో చర్చికి రూ.30 వేల ఆర్థిక సాయం

TG: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒక్కో చర్చికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అర్హతమైన, రిజిస్టర్డ్ చర్చిలలో వైట్ వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసం ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. ఈ ఆర్థిక సాయం పొందాలంటే చర్చిల నిర్వాహకులు నవంబర్ 30 వరకు tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.