TG: రాబోయే వ్యవసాయ సీజన్లపై అనిశ్చితి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా 15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం 14 నెలలకు సరిపడా నిల్వలున్నాయన్నారు. వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గినా ఆహార భద్రతకు ఢోకా లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు.
వార్తలు
'15 నెలలకు బియ్యం నిల్వలు సిద్ధం చేయండి'


