NRPT: కృష్ణ మండలం ఐనాపూర్ నుంచి సుగూర్ లింగంపల్లి వరకు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు మంగళవారం భూమిపూజ నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఈ పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. రహదారి నిర్మాణం పూర్తయితే విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్య సేవలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి సోదరుడు శేషగిరి, సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఐనాపూర్–సుగూర్ రోడ్డుకు భూమిపూజ


