హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దె కట్టలేదని రోడ్డుపైకి.. ఆదుకున్న పోలీసులు

VSP: భర్త అనారోగ్యంతో పని చేయలేక అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డుపైకి చేరింది. హనుమంతువాకకు చెందిన మీనాక్షి 3, 5 ఏళ్ల పిల్లలు, భర్తతో 3 రోజులుగా వుడా పార్కు బస్ స్టాప్‌లో తలదాచుకుంటున్నారు. 3 నెలలుగా అద్దె కట్టలేకపోవడంతో యజమాని ఖాళీ చేయించారు. దీనస్థితిని గుర్తించిన పోలీసు కమిషనర్ సూచనతో పోలీసులు వారిని పెదవాల్తేరు రెడ్ క్రాస్ వసతిగృహానికి తరలించారు.