హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు

NTR: కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై బుధవారం రాత్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.