కృష్ణా: మోపిదేవి పంచాయతీ శివారు రావివారిపాలెం గ్రంథాలయం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.బైక్‌పై వస్తున్న బోడగుంటకు చెందిన కొక్కిలిగడ్డ అశోక్‌ను గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు


