హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంది అవార్డుల పునరుద్ధరణ

GNTR: పదేళ్ల విరామం తర్వాత నంది అవార్డులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.15.28 కోట్లు మంజూరు చేసింది. 2026-27 బడ్జెట్ నుంచి రూ.5 కోట్లు, ఏపీ ఫిల్మ్, టీవీ, థియేటర్ అభివృద్ధి సంస్థ డిపాజిట్ నుంచి రూ.9.61 కోట్లు వినియోగిస్తారు. 2012–2025 సినీ, టీవీ నంది అవార్డులు, నాటకోత్సవం, కందుకూరి అవార్డులు ప్రదానం చేస్తారు. ఏర్పాట్ల బాధ్యత ఎస్.ఎస్. రావత్‌కు అప్పగించారు.