హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

KDP: వేంపల్లె వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో బుధవారం ఫ్రెషర్స్, ఫేర్వెల్ వేడుకలు జరిగాయి. ప్రిన్సిపల్ ఉషశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన విద్యార్థులకు స్వాగతం పలికి, చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం సెమిస్టర్ పరీక్షల్లో కళాశాల టాపర్లుగానిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.