హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారి సృజనాత్మకతను అభినందించిన కలెక్టర్

NTR: విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చిట్టూరి హైస్కూల్ ఐదో తరగతి విద్యార్థిని మల్లిపెద్ది దక్ష(10) తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ డా. జీ.లక్ష్మీశను కలిసింది. తాను రూపొందించిన కాన్వాస్ పెయింటింగ్, పూసల బ్రాస్లెట్లను ప్రదర్శించగా కలెక్టర్ అభినందించారు. పిల్లల ఆసక్తులను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.