హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచంటలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

W.G: ఆచంట మండలంలో గురువారం జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12 పంచాయతీలలో 37 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు పోటీపడుతున్నారు. 43 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 103 వార్డులకు 227 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 600 మంది సిబ్బందిని నియమించారు. మండలంలో 48,534 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.