హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొదిలిలో కలెక్టర్ తనిఖీ

ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత బుధవారం పొదిలిలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని, ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.