NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో చాటిన ఐక్యతను పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికే: ఎమ్మెల్యే


