హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే లక్ష్యం'

NLR: స్వచ్ఛమైన ఓటరు జాబితా, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి అభినందించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకొని, ఎన్నికల్లో బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.