హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేటలో వర్షం, రైతులకు కన్నీళ్లు

MDK: నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి మోస్తారు వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండి, రాత్రి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాహకులు టార్పాలిన్ లు సైతం అందివ్వడం లేదని వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి కొనుగోలులో వేగం పెంచాలని వేడుకుంటున్నారు.