SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో పోలీస్ ప్రజాభరోసా కార్యక్రమంలో భాగంగా పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పోలీస్ అక్క కార్యక్రమంపై వివరించారు. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు పోలీసుల భద్రతా పాఠాలు


