HYD: పానిపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల్లోని వసతులను పరిశీలించారు. విద్యాబోధన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చిన్నారులకు అందించే పోషకాహారంపై శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


