WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కేంద్రాన్ని జడ్పీ సీఈఓ వసంత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం అందేలా చూస్తామన్నారు. దరఖాస్తుల పరిశీలన, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి ప్రకాష్, కార్యదర్శి పాల్గొన్నారు.
తెలంగాణ
బీమా కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ


