హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 29న కార్తీక దీపోత్సవం.. పోస్టర్ ఆవిష్కరణ

KNR: కరీంనగర్ గాంధీ రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో 29న నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం పోస్టర్‌ను సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి. సుగుణాకర్ రావు ఆవిష్కరించారు. సనాతన ధర్మ సంప్రదాయాలు, భక్తిభావం పెంపొందించడమే ఉద్దేశమని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే వేడుకకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.