SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
తెలంగాణ
'ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'


